Saturday, December 15, 2012

6 + 6 - 11 = 1

For everybody its just maths.. But for me, lot more than that...!!!

In short - "Changed my life."

Thursday, November 8, 2012

Hermit....


Andari vaadini Nenu....
Kani Naa vallu antu leni vanni...
Vunna gurthincha leni vanni...

Evaru nuvvu ani adigithe,
cheppaleni mounanni.... 
Mounam tho tappukune ontarini....

Avunu, nenu ontarini 
Andaru vunna ontarini.....
Naaloni nanne vethukuntunna ontarini....

Ennallu ela ani adigithe,
Kaalam vypu chuse kalani...
Kalallo kuda naa valla kosam chuse ontarini..

Endukila, ani adigithe
Chiru navve chirunamaga vunna vanni...
hmm.... Nenu ontarini... !!!

Wednesday, November 7, 2012

నేను ఎవరిని...


మనసు తలపులు తెరిచి  ఉంచిన బాటసారిని...
మనసు మాట తెలుపలేని ముగావాడిని ...
పదం కదిలినా పెదవి దాటని ఒంటరిని....
నేనంటే ఏంటో నాకే అర్ధం కానీ ప్రశ్నని....!!!!

Friday, October 19, 2012


మరో ఉదయం కోసం  నా ఎదురు చూపులు 
మరో ఆశయం కోసం  నా ఆలోచనలు 
మరో పిలుపు  కోసం  నా తప్పసులు
మరో మార్పు  కోసమే నా అడుగులు

ఇక రా మరి.... 

చాలు ఇక గడిపిన ఒంటరి క్షణాలు 
చాలు ఇక చుసిన ఎదురు చూపులు 
చాలు ఇక వేధించిన అంతర్మధనాలు 
చాలు ఇక కాలం  నేర్పిన పాఠాలు 


కథ కాదు కదా నా గతం 
కల కాదు కదా గడిచిన క్షణo  
కురుక్షేత్ర శంకరావమే కదా నా ఒంటరితనం  
అంకురార్పనే తప్ప అంతమే మరిచిన నా గుండె మంటను ఎలా తెలుపను ...!!!



కాలాన్ని మార్చలేక... నిను మరువలేక... నన్నే అంతం చేసుకోలేక... 
ఒడి.. విసిగి.. వేసరి చెపుదున్న... ఓ ఒంటరి!!

సప్త స్వరాలూ తెలియని రాగం నాది
  మౌనమే పదాలుగా కూర్చిన పాటగా నా సొతం... 
గ్లీష్మంలో మీగిలిన బస్మం నేను 
అందుకే అఖండ అశేషంలో మిగేలిన శేషాన్ని...
ఉషోదయమే తెలియని ఓ కాలం ఇది 
      కనుకనే కనుమరుగయి పోయింది నా గతం .... !!!

Tuesday, October 9, 2012

It's a burning heart...!!!


నా గుండె చీల్చి నువ్వు వెళ్ళిపోయినా... నా ఊపిరికి ఇంకా నువ్వే ఆదారం..!!
నాలో నన్నే సమాది చేసినా.. నీతో మరు జన్మ కోసమే నా తపస్సు....!!
నా ఇష్టం నిను దరిచేరకున్నా...నీకోసమే నా ఎదురు చూపులు....!!
కాలం శాపం అయినా...విధి భారమైనా... కన్నిల్లె వరమైనా...
                 నీ కోసమే ఎదురుచూస్తూవున్నా... నీ పలకిరింపు కోసమే పరితపిస్తున్నా..!!!!


Wednesday, April 25, 2012

Found in my treasure.....


నా కలల్లోని ఉర్వశివా.... అజంత శిల్పనివా.....
సాయంత్రపు వెన్నేల్లవా.... చిరుజల్లుల సవ్వడివా....


ఎవరివో.... నీవేవ్వరివో....


మిన్నును సైతం తాకిన నీ అందం, నా ఎద గుమ్మాన్ని చేరేది ఎప్పుడు
మైమరపించే నీ తలంపు, నిజం అయ్యేది ఎప్పుడు 


ఎప్పుడో... ఎప్పుడో... ఇంకెప్పుడో... నీవే చెప్పుమా....
ఎన్నాళ్ళో... ఎన్నాళ్ళో... ఇంకేన్నల్లో... ఈ మదుర వేదన... నీవే చెప్పుమా......!!!!!


Note - Wrote this very long time back...... almost starting days of my poetry

Sunday, April 15, 2012


ఈ అక్షరం ఎ  సిరాతో రాయనూ...
నువ్వు లేని ఈ క్షణాన్ని ఏమని శపిన్చనూ...


నా ఇష్టం తెలుపుటకు వందల పదాలు కావాలా, నా మౌనం సరిపోదా...
నిజాన్ని సమాది చేసే అబద్దమేనా నా జీవితం...


కల కాదు కదా, నీతో గడిపిన క్షణాలు....
కనీసం, కలలో ఐన, నా చెంత చేరలేవ.... నను ఒదార్చ లేవ....!!!!!

Thursday, March 8, 2012

నువ్వు ......


నా గుండె చప్పుడికి సాక్షం నువ్వు...
నా ఆలోచనలకూ ప్రేరణ నువ్వు....
నా మౌనానికి భాష్యం నువ్వు.....
నా ఎదురు చూపులకు గమ్యం నువ్వు..
నువ్వు...  నువ్వు... ఆ నువ్వు లోనే  నేను...!!! 

Sunday, February 12, 2012

నా నిచ్చెలి.....!!!!


చెలి తలంపు మదిలో చేరగా,
        మనసు పోంగానే మరో సునమిలా ...
నిను తలచి పదం కలుపగా,
        కలం కదిలే లే  కవితల వరదలా...
చిలిపి పనులు నిను గుర్తుకు చేయగా,
        పాదం కదిలేగా నిను చేరే దారిగా....
నిను తలిచి ముందుకు  సాగగా,
        ప్రపంచమే నా ముందు తల వంచేగా.....
చెలి... నా నిచ్చెలి.....!!!!

Friday, February 10, 2012