Friday, September 30, 2011

Sunday, September 25, 2011

My dream girl....

సుధూర తీరానా ఉన్నది ఓ సువర్ణ సుందరి ....
నా మది దొచిన నా స్వర్ణ మంజరి .....
నా కలలకు  ఆకారం ఆమె అందం...
నా మనసుకు ప్రతిరూపం ఆమె మృదు దరహాసం....!!!

నా కనులకు కనుపాప  తను 
నా చిరునవ్వుకు చిరునామా తను
నా అశలకూ ప్రేరణ తను 
నా లక్ష్యానికి గమ్యం తను ....!!!

వయల సొగసులు ఆమె సొంతం
వన్నెల చిన్నలు ఆమెకు అందం
ప్రకృతికి ప్రతిరూపం ఆమె రూపం
కజురహో శిల్పం ఆమె సోయగం....!!! 

అహో...!!!
నా చెలిని వర్ణించ సాగిన పదం ఆగున...
నా ప్రేయసికి సరి తూగు ప్రతిరూపం దొరుకున.... !!!





నిన్ను చూసి ... నన్ను మరచి... నీకే దాసోహం అయ్యాను 
నీ ప్రేమ కారాగారంలో బందీని అయ్యాను
ఇక నిన్ను విడలేను......నన్ను మార్చలేను
ఈ జీవితం ఇక నీకే అంకితం....!!!


జోహార్లు చెలి నీకు....!!!

Incomplete without you.....!!!!


Thursday, September 15, 2011

తోలి చుపులోనే వలచాను నిన్ను


   తోలి చుపులోనే వలచాను నిన్ను
         ఆ క్షణము నుండె మరచాను నన్ను
  నా చిరు మదిలో పులకింత రేపావు
       నా  ఎదలయకు  రాగానివయ్యవు
  వేయి జన్మల ఫలంతో  నీ ప్రేమను పొందిన నాడు
      మనసున సంబరాలు అంబరాన్ని అంటాయి...
      నా ప్రేమ అలలు నీ మది తీరాన్ని తాకాయి.....

          ప్రేమ చిన్న అలయితే ఒక సముద్రాన్ని ఇచ్చేవాడిని   
          ప్రేమ పచ్చటి ఆకైతే ఒక మహా వృక్షాన్ని ఇచ్చేవాడిని
          ప్రేమ చిన్న గ్రహమైతే నేనొక పలపున్తనే ఇచ్చేవాడిని

  నీ పలుకుతో  తెయ్యదనం, నీ చూపుల్లో సూటిదనం
  నీ  కౌగిల్లో వెచ్చదనం మరువలేను ప్రతి క్షణం
  మన ఊహలతో ప్రపంచాన్ని చుట్టం
  చిరు ఆశలతో స్వర్గాన్ని మీటాం
  కాని తాడు తెగిన గాలిపటంలా
  మన ప్రేమ నెలకు ఒరిగింది
  కనుపాప దాటని కలువలా ఎద మడుగులో  ఇంకిపోయింది

  నిను కానలేని కనులు ఎందుకు ??
  నీవులేని ఇ జీవం  ఎందుకు ???? (అనుకున్న)

  (కాని )
  కనులుండెను  కలలతో నిన్ను  చూచుటకు
  బ్రతికుండెను  నేను నిన్ను చేరుటకు (అని )

  (ఆశతో)
  నీ  స్మృతులను  ఆకృతిగా మలచి
  నా  మనసును  కోవెలగా  చేసి  ఎల్లప్పుడూ  నిన్ను  ఆరదిస్తున్నా.....`